నాలుగేళ్లుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు..కరాటే master arrested

ABN , First Publish Date - 2021-11-29T16:56:12+05:30 IST

విద్యార్థినిపై నాలుగేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రైవేట్‌ స్కూలు కరాటే మాస్టర్‌ను, ఫిర్యాదు చేసినా పట్టించుకోని స్కూలు కరస్పాండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌-2 చదువుతున్న విద్యార్థిని ఈ

నాలుగేళ్లుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు..కరాటే master arrested

చెన్నై: విద్యార్థినిపై నాలుగేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రైవేట్‌ స్కూలు కరాటే మాస్టర్‌ను, ఫిర్యాదు చేసినా పట్టించుకోని స్కూలు కరస్పాండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌-2 చదువుతున్న విద్యార్థిని ఈ నెల 22న ఇంటిలో తన చేతిని బ్లేడుతో కోసుకుని, ఉరిపోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు చూసి వెంటనే ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆ విద్యార్థిని ఆత్మ హత్యాయ త్నానికి చెప్పిన కారణాలు తల్లిదండ్రులను దిగ్ర్భాంతికి గురి చేశాయి. ఆ విద్యార్థిని ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువు తున్నప్పటి నుంచి కరాటేమాస్టర్‌ రాజా లైంగిక వేధింపులకు పాల్పడు తున్నాడని, స్కూలు కరస్పాండెంట్‌ స్టీఫన్‌ దేవరాజ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. ఇటీవల కరాటే మాస్టర్‌ చేష్టలు అధికం కావ టంతో ఆమె ఆత్మహత్యాయ త్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు తెలుసు కున్నారు. విషయం తెలిసిన స్థానికులు కరాటే మాస్టర్‌ రాజాను నిర్బంధించి కరుమత్తురై పోలీసులకు అప్ప గించారు. పోలీసులు కరాటే మాస్టర్‌ రాజాను,ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని స్కూలు కరస్పాండెంట్‌ స్టీఫన్‌ దేవరాజ్‌ను పోక్సోచట్టం కింద అరెస్టు చేశారు.

Updated Date - 2021-11-29T16:56:12+05:30 IST