సుప్రీం కోర్టులో మస్తాన్‌వలి కేవియెట్‌

ABN , First Publish Date - 2020-05-31T08:33:58+05:30 IST

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసులో పిటిషనర్‌గా ఉన్న పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి సుప్రీంకోర్టులో కేవియెట్‌ పిటిషన్‌

సుప్రీం కోర్టులో మస్తాన్‌వలి కేవియెట్‌

న్యూఢిల్లీ, మే 30(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసులో పిటిషనర్‌గా ఉన్న పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి సుప్రీంకోర్టులో కేవియెట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నందున ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని... ఈ విషయంలో తమ వాదన వినకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని అభ్యర్థించారు. వ్యక్తుల మీదనో, ప్రభుత్వం మీదనో వ్యతిరేకతతో ఇలా చేయడం లేదని... రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో కేవియెట్‌ దాఖలు చేశానని చెప్పారు.

Updated Date - 2020-05-31T08:33:58+05:30 IST