ఘనంగా మస్తానయ్య ఉరుసు మహోత్సవం

ABN , First Publish Date - 2021-03-05T06:09:05+05:30 IST

స్థానిక జీటీ రోడ్డు శ్రీ హజరత్‌ కాలే మస్తాన్‌షా అవులియా 129వ ఉరుసు మహోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి.

ఘనంగా మస్తానయ్య ఉరుసు మహోత్సవం
బాబా సమాధిని దర్శించుకుంటున్న భక్తులు

గుంటూరు(సాంస్కృతికం), మార్చి 4: స్థానిక జీటీ రోడ్డు శ్రీ హజరత్‌ కాలే మస్తాన్‌షా అవులియా 129వ ఉరుసు మహోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. ధర్మకర్త రావి రామ్మోహనరావు  దంపతులు బాబా వారి సమాధిపై నూతన చద్దర్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పకీర్లకు అన్నదానం, బాబా వారికి భక్తులు సమర్పించిన శేష వస్త్రాలను పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు బాబా వారిని దర్శించి మొక్కులను తీర్చుకున్నారు. 

Updated Date - 2021-03-05T06:09:05+05:30 IST