మరో బాదుడు ..

ABN , First Publish Date - 2022-04-14T06:02:39+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ, అద్దెవి కలుపుకొని 799 బస్సులు ఉన్నాయి. పెంచిన చార్జీలతో ఇక ప్రతి రోజు సుమారు రూ.8 లక్షల భారం ప్రజలపై పడనుంది. ఈ లెక్కన రూ.2.40 కోట్లు నెలకు భారం పడే

మరో బాదుడు ..
విద్యుత్‌, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ ఎడ్లబండితో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్‌శర్మ

ఈ ఆర్టీసీ వంతు 
భారీగా పెరిగిన బస్సు చార్జీలు 
పల్లె వెలుగులో టికెట్‌ పై రూ.10 
ప్రయాణీకుల పై అదనపు భారం 

జగన్‌  సర్కార్‌ మళ్లీ జనంపై భారం మోపేసింది. నిన్న కరెంట్‌ చార్జీలు పెంచి, బిల్లు పట్టుకోకుండానే షాక్‌ కొట్టించారు. ఇప్పుడు ప్రజారవాణా వ్యవస్థ (ఆర్టీసీ) వంతైంది. డీజల్‌ ధరలు పెరిగాయన్న నెపం చూపించి చార్జీలు బాదేశారు. డీజల్‌ సెస్సు, సేఫ్టీ సెస్సు, టోల్‌ప్లాజా సెస్సు అంటూ పేర్లు పెట్టి జనం పై భారం మోపారు. పెరిగిన చార్జీలు గురువారం నుంచే అమలు కానున్నాయి. ఇక పల్లె వెలుగులో చిల్లర సాకు చూపి కనీస చార్జీ రూ.13ను రూ.15 చేశారు. కడప నగరం నుంచి ఇతర ప్రధాన పట్టణాలకు, నగరాలకు వెళ్లే ప్రతి బస్సులోనూ చార్జీలు పెంచారు. 

కడప, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ, అద్దెవి కలుపుకొని 799 బస్సులు ఉన్నాయి. పెంచిన చార్జీలతో ఇక ప్రతి రోజు సుమారు రూ.8 లక్షల భారం ప్రజలపై పడనుంది. ఈ లెక్కన రూ.2.40 కోట్లు నెలకు భారం పడే అవకాశం ఉంది. పల్లె వెలుగు 435, ఎక్స్‌ప్రెస్‌ 182, సూపర్‌లగ్జరీ 102, ఆల్ర్టా డీలక్స్‌ 51, ఆల్ర్టా పల్లెవెలుగు 11, ఇంద్ర 11, అమరావతి 6, సూపర్‌లగ్జరీ ఏసీ ఒక్క బస్సు ఉన్నాయి. రోజూ 3.14 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరుగుతాయి. 2.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఇక పల్లె వెలుగు రోజూ 1.37 లక్షల కిలోమీటర్లు, ఆల్ర్టా పల్లెవెలుగు 3,900, ఎక్స్‌ప్రెస్‌ 78,643, ఆల్ర్టా డీలక్స్‌ 21వేలు, సూపర్‌ లగ్జరీ 53 వేలు, సూపర్‌లగ్జరీ ఏసీ 642, ఇంద్ర 5 వేలు, అమరావతి బస్సులు 2,800 కి.మీ. తిరుగుతాయి. 

ఇదెక్కడి భారం స్వామీ..
సంక్షేమం పేరుతో జగన్‌ సర్కార్‌ భారీగా పన్నుల భారం మోపుతోంది. కరోనా నుంచి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఇంకా కోలుకోలేదు. అలాంటి వారికి ఉపశమనం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఖజానా నింపుకునేందుకు పన్నుల భారాన్ని మోపుతోంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజల్‌పై అన్ని రాష్ట్రాల కంటే అదనంగా పన్ను వసూలు చేస్తోంది. దాని ఎఫెక్ట్‌ నిత్యావసర ధరలపై పడింది. వాటి ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదోడు మూడు పూటలా తినలేని పరిస్థితి నెలకొంది. ఇక పట్టణాల్లో  వరుసగా రెండో ఏడాది కూడా ఆస్తి పన్ను పెంచేశారు. దీనికి తోడు చెత్త పన్ను ఒకటి. ఈ భారాలతోనే జనం కుదేలవుతుండగా ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచి మరింత భారం మోపారు. ప్రభుత్వం డీజల్‌ బూచిని చూపించి చార్జీలు పెంచేసింది. ప్రభుత్వం డీజల్‌పై, పెట్రోల్‌ పై విధించిన పన్ను తగ్గించుకుంటే చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొంటున్నారు.

బస్సు చార్జీల పెంపు దుర్మార్గం
- లింగారెడ్డి కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు 
డీజల్‌ ధరల పెంపు సాకుతో బస్సు చార్జీలు పెంచడం దుర్మార్గం. ఇప్పటికే పెరిగిన ధరలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పెరిగిన చార్జీలతో మరింత భారం పడుతుంది. డీజల్‌, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులు తగ్గించుకుంటే చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. చార్జీలు వెంటనే తగ్గించాలి. 

చార్జీల పెంపు ప్రజలపై భారం 
- చంద్రశేఖర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి 
ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి పేద, మధ్య తరగతిపై భారం మోపారు. కేరళలో పెట్రోల్‌, డీజల్‌ ధరల పెంపు జనంపై పడకుండా చూస్తున్నారు. ప్రతి దాంట్లో మోదీని సమర్థిస్తున్న జగన్‌.. కేంద్రం పెంచే భారం జనంపై పడకుండా భరించాలి.

వడ్డీల కోసమే పన్నుల భారం
- నీలి శ్రీనివాసులు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు
జగన్‌ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక జనం పై పన్నుల భారం మోపుతున్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచి జనం పై మరోసారి బాదేశారు.

ఇది పదోరత్నం..
- ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి 
జగన్‌ ఇప్పుడు కొత్త ఫార్ములాకు తెరలేపారు. మద్యం తాగుడు మాన్పించేందుకు రేట్లు పెంచడం, కరెంటు వినియోగాన్ని తగ్గించేందుకు కరెంట్‌ చార్జీలు పెంచడం, ఆస్తులు కూడబెట్టుకోడాన్ని తగ్గించుకోడానికి ఆస్తి పన్ను, ఇప్పుడు బస్సు ప్రయాణం తగ్గించుకునేందు బస్సు చార్జీలు పెంచి పదో రత్నాన్ని ప్రవేశపెట్టాడు. ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోసేశారు. 


చార్జీల పెంపు ఇలా..
రూటు పాత ధర కొత్త ధర

కడప-బద్వేలు 45 60
ఆల్ర్టాపల్లెవెలుగు 50 65
ఎక్స్‌ప్రెస్‌ 70 75
సూపర్‌ లగ్జరీ 90 95
కడప-రాజంపేట
పల్లెవెలుగు 45 60
ఆల్ర్టాపల్లెవెలుగు 50 65
ఎక్స్‌ప్రెస్‌ 65 70
అట్రా డీలక్స్‌ 80 85
కడప-రాయచోటి
పల్లెవెలుగు 50 65
ఎక్స్‌ప్రెస్‌ 70 75
ఆల్ర్టా డీలక్స్‌ 85 90
సూపర్‌ లగ్జరీ 90 95
కడప-పులివెందుల
పల్లెవెలుగు 55 70
ఎక్స్‌ప్రెస్‌ 85 90
ఆల్ర్టా డీలక్స్‌ 105 110
సూపర్‌ లగ్జరీ 110 115
కడప-మైదుకూరు
పల్లెవెలుగు 40 45
ఎక్స్‌ప్రెస్‌ 50 55
ఆల్ర్టా డీలక్స్‌ 55 60
సూపర్‌ లగ్జరీ 60 65
కడప-జమ్మలమడుగు 
పల్లెవె లెగు 70 85
ఎక్స్‌ప్రెస్‌ 100 105
సూపర్‌ లగ్జరీ 120 130
క డప- ప్రొద్దుటూరు 
పల్లెవెలుగు 50 65
ఎక్స్‌ప్రెస్‌ 70 75
సూపర్‌ లగ్జరీ 120 130
కడప-విజయవాడ
సూపర్‌లగ్జరీ 540 550
ఇంద్ర 735 750
కడప-బెంగళూరు
సూపర్‌ లగ్జరీ 485 500
ఇంద్ర 490 510
అమరావతి 685 700
కడప-చెన్నై 
సూపర్‌ లగ్జరీ 470 480
కడప-హైదరాబాద్‌ 
సూపర్‌ లగ్జరీ 635 640
ఇంద్ర 780 800
అమరావతి 1015 1030

Updated Date - 2022-04-14T06:02:39+05:30 IST