బీచ్‌లో భారీ తిమింగలం కళేబరం.. దాని పొట్టకోసి చూస్తే షాకింగ్ దృశ్యం..!

ABN , First Publish Date - 2022-05-15T01:35:38+05:30 IST

విచ్చలివిడిగా శిలాజ ఇంధనాలు, ప్లాస్టిక్ వంటి వాటిని వినియోగిస్తు పర్యావరణ హననానికి పాల్పడుతున్న మానవుడు.. తాను ప్రమాదంలో పడటమే కాకుండా అమాయక మూగజీవాలను మృత్యువు ఒడిలోకి పంపిస్తున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో ఇటీవల కనిపించిన ఓ దృశ్యం ఇందుకు తాజాగా ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీచ్‌లో భారీ తిమింగలం కళేబరం.. దాని పొట్టకోసి చూస్తే షాకింగ్ దృశ్యం..!

ఎన్నారై డెస్క్: ఆధునికత పేరుతో మనిషి సాగిస్తున్న కార్యకలాపాలు..  కూర్చుకున్న కొమ్మ నరుకున్న చందంగా ఉంటాయన్న విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. విచ్చలివిడిగా శిలాజ ఇంధనాలు, ప్లాస్టిక్ వంటి వాటిని వినియోగిస్తు పర్యావరణ హననానికి పాల్పడుతున్న మానవుడు.. తాను ప్రమాదంలో పడటమే కాకుండా అమాయక మూగజీవాలను మృత్యువు ఒడిలోకి పంపిస్తున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో ఇటీవల కనిపించిన ఓ దృశ్యం ఇందుకు తాజాగా ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఇటీవల ఫ్లోరిడా కీస్ ప్రాంతంలోని సముద్రం తీరాన ఓ భారీ తిమింగలం కళేబరం పడి ఉండటం  స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది. ఈ క్రమంలో ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ పరిశోధన సంస్థ  సిబ్బంది.. తిమింగలం మృతికి గల కారణాలను కనుగొనేందుకు అటాప్సీ నిర్వహించారు. ఈ సందర్భంగా తిమింగలం పొట్టకోసి చూస్తే.. అక్కడ భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయి. చేపల వేటకు వాడే ప్లాస్టిక్ వల తాలూకు అవశేషాలు.. తాళ్లు, ప్లాస్టిక్ బ్యాగులు దాని కడుపులో కనిపించాయి. ఈ వార్త స్థానికులను కలచివేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగానే ఆ తిమింగలం మృతి చెంది ఉంటుందని వారు భావించారు. కడుపులో ఇలాంటి చెత్త పేరుకుపోవడంతో తిమింగలం ఆహారం తీసుకోలేక మరణించి ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. కళేబరంలోని ఇతర శాంపిళ్లను కూడా పరీక్షించాక మృతిగల కారణమేంటో స్పష్టంగా తెలుస్తుందని పరిశోధన సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేసే విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రజలు ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా.. మూగజీవాలు అన్యాయంగా బలైపోతాయని హెచ్చరించారు. 



Read more