అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ABN , First Publish Date - 2021-11-05T12:33:47+05:30 IST

దీపావళి మరుసటి రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషంగా...

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

అనంతపురం : అనంత జిల్లాలో దీపావళి మరుసటి రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషంగా పండగ చేసుకుని మునుపటిలాగే కూలి పనికెళ్తున్న ఆ ఆరుగురి కుటుంబాల్లో ఓ గుర్తు తెలియని వాహనం యమపాశమై పెనువిషాదాన్ని నింపింది.!. పూర్తి వివరాల్లోకెళితే.. పామిడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను తెల్లవారుజామున 5 గంటలకు ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగులు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రమాదం చూసిన వాహనదారులు, స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.


కాగా.. ఈ ఘటనలో చనిపోయిన వారు, గాయపడిన వారంతా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన వారని గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. లారీ ఢీ కొని ఉండొచ్చని.. మద్యం మత్తులో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మృతులు వీరే..

1. శంకరమ్మ

2. నాగవేణి

3. చౌడమ్మ

4. సావిత్రి

5. సుబ్బమ్మ

Updated Date - 2021-11-05T12:33:47+05:30 IST