అనకాపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సుబ్బారాయుడుపాలెం దగ్గర కారు ప్రమాదం జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. కాగా.. మృతులు మాకవరపాలెం, తామరం గ్రామాల వాసులని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.