రాష్ర్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

ABN , First Publish Date - 2021-12-25T05:08:56+05:30 IST

రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లను భారీగా

రాష్ర్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మంది సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేసింది. సిటీ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌‌ను  ఏసీబీ డీజీపీగా బదిలీ చేసింది. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ను నియమించింది. క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ అడిషనల్‌ సీపీగా షికా గోయల్‌ నియమితులయ్యారు. క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌ నియమితులయ్యారు. నల్గొండ ఎస్పీగా రమా రాజేశ్వరిగా బదిలీ చేసింది. కామారెడ్డి ఎస్పీగా ఉన్న ఎన్‌ శ్వేతను సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా నియమించింది. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న జోయల్‌ డేవిస్‌ను వెస్ట్‌ జోన్‌ డీసీపీగా బదిలీ చేశారు. కార్ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌గా కార్తికేయను నియమించారు. మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శినిని బదిలీ చేసింది. 



 నారాయణపేట జిల్లా ఎస్పీగా ఎన్‌ వేంకటేశ్వర్లు నియమితులయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లిగా ఎస్పీ జె సురేందర్‌ రెడ్డి బదిలీ అయ్యారు. కామారెడ్డి ఎస్పీగా బి శ్రీనివాస్‌ రెడ్డి నియమతులయ్యారు. నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా కె మనోహర్‌ను ప్రభుత్వం నియమించింది. నిర్మల్‌ ఎస్పీగా సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ను, అసిఫాబాద్‌ ఎస్పీ కె సురేష్‌ కుమార్‌, ఆదిలాబాద్‌ ఎస్పీగా డి ఉదయ్‌కుమార్‌ రెడ్డిలను నియమించింది. నిజామాబాద్‌ సీపీగా కేఆర్‌ నాగరాజు నియమితులయ్యారు. వికారాబాద్‌ ఎస్పీగా ఎన్‌ కోటిరెడ్డి, మహబూబాబాద్‌ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


మహబూబ్ బాడ్ ఎస్పీగా శరత్ చంద్ర నియమితులయ్యారు. నాగర్ కర్నూల్ ఎస్పీగా మనోహర్, జనగామ డీసీపీగా సీతారాంలను నియమించింది. నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్, శంషాబాద్ డీసీపీగా జగదీశ్వర్ రెడ్డి., అసిఫాబాద్ ఎస్పీగా సురేష్, మాదాపూర్ డీసీపీగా శిల్పవల్లిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


Updated Date - 2021-12-25T05:08:56+05:30 IST