రామతీర్థంకి భారీగా ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-06-29T06:16:09+05:30 IST

రామతీర్థం రిజర్వాయర్‌కు సాగర్‌ జలాలు భారీగా చేరుకుంటున్నాయి.

రామతీర్థంకి భారీగా ఇన్‌ఫ్లో
రామతీర్థం జలాశయం

రిజర్వాయర్‌లోకి 1340 క్యూసెక్కుల నీరు

చీమకుర్తి, జూన్‌ 28 : రామతీర్థం రిజర్వాయర్‌కు సాగర్‌ జలాలు భారీగా చేరుకుంటున్నాయి. మంగళవారం ఇన్‌ఫ్లో 1340క్యూసెక్కులకు చేరింది. దిగువకు నీటి విడుదలను నిలిపివేసి జలాశయాన్ని నింపడంపై అధికారులు దృష్టి సారించారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 85.34 మీటర్లు కాగా ప్రస్తుతం 77.90 మీటర్ల మేర నీరు ఉంది. మరో పదిరోజులపాటు ప్రస్తుత ఇన్‌ఫ్లో కొనసాగితే జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంది. ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీరతాయి.





Updated Date - 2022-06-29T06:16:09+05:30 IST