Pune రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-06-08T13:39:59+05:30 IST

మహారాష్ట్ర పూణే నగరంలోని ఔంధ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ రూఫ్ టాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది....

Pune రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్ర పూణే నగరంలోని ఔంధ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ రూఫ్ టాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.అగ్నిప్రమాదం జరిగిన ట్రూ ట్రాంప్ ట్రంప్ అనే రెస్టారెంట్ క్రోమా షాప్ పైన పదో అంతస్తులో ఉంది.మంటలు రెస్టారెంట్ లోపలి భాగంలో వ్యాపించాయి. రెండేళ్లుగా రెస్టారెంట్ మూతపడి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.మంటలను ఆర్పేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.అగ్నిప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది.అగ్నిమాపకశాఖ, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పుతున్నారు.


Updated Date - 2022-06-08T13:39:59+05:30 IST