Delhi: ఇండస్ట్రియల్ ఏరియా షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-09-23T17:12:25+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని నరేలా పారిశ్రామికవాడలో(Delhis Narela industrial area) శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది....

Delhi: ఇండస్ట్రియల్ ఏరియా షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని నరేలా పారిశ్రామికవాడలో(Delhis Narela industrial area) శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలోని షూ, స్లిప్పర్ల తయారీ ఫ్యాక్టరీలో(shoe factory) మంటలంటుకున్నాయి. దీంతో 8 అగ్నిమాపక వాహనాలు(fire brigade vehicles) హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఆస్తినష్టం జరిగిందని పోలీసులు చెప్పారు. గురువారం కూడా ఢిల్లీలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో వరుసగా రెండు రోజుల్లో రెండు అగ్నిప్రమాదాలు జరిగాయి.  

Updated Date - 2022-09-23T17:12:25+05:30 IST