Mumbai: సినిమా సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-07-29T23:17:24+05:30 IST
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సబర్బన్ అంథేరిలో భారీ అగ్నిప్రమాదం..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సబర్బన్ అంథేరి (West)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంథేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న చిత్రకూట్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫిల్మ్ సెట్లో మధ్యాహ్నం 4.30 గంటలకు ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
తొలుత ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు వచ్చినట్టు అధికారులు చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఫిల్మ్ సెట్లో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించారు. దట్టమైన పొగలు చట్టుపక్కల వ్యాపించడంతో మంటలను అదుపు చేసేందుకు మూడు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమచారం లేదని అధికారులు చెప్పారు.