శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కరెన్సీ పట్టివేత

ABN , First Publish Date - 2021-04-13T00:57:01+05:30 IST

నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సనీని

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కరెన్సీ పట్టివేత

హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఓ ప్రయాణికుడు దుబాయ్‌కి వెళుతున్నాడు. అతడిని సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేయగా అతని వద్ద 17 లక్షల  రూపాయల విలువైన సౌదీ అరేబియా దేశానికి చెందిన కరెన్సీ దొరికింది. ఈ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులకు సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది అప్పగించింది.

Updated Date - 2021-04-13T00:57:01+05:30 IST