Nagpanchami: పాముల జాతరకి భారీ జనం

ABN , First Publish Date - 2022-07-19T12:47:00+05:30 IST

నాగ పంచమి(Nagpanchami) సందర్భాన్ని పురస్కరించుకొని...

Nagpanchami: పాముల జాతరకి భారీ జనం

పాట్నా(బీహార్): నాగ పంచమి(Nagpanchami) సందర్భాన్ని పురస్కరించుకొని బీహార్ (Bihar) రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో భక్తులు విశిష్ఠమైన పాముల జాతర (snake fair) నిర్వహించారు.సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పాముల జాతరలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్తిపూర్‌లోని సింఘియా ప్రాంతంలో గత 300 సంవత్సరాలుగా ప్రత్యేకమైన పాముల జాతర నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో భగత్‌లు (పాముల మంత్రగాళ్లు) నదిలో(river) స్నానాలు చేసి తమ చేతుల్లో పాములతో బయటకు వచ్చారు.భగత్‌లు పలు రకాల పాములను నోటితో లేదా తోకతో పట్టుకుని బయటకు నదిలో నుంచి వచ్చి జాతరలో పాల్గొనడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.


జాతర ప్రారంభంలో పాముల మంత్రగాళ్లు సింఘియా బజార్‌లో ఉన్న మా భగవతి ఆలయంలో( Maa Bhagawati temple) ప్రార్థనలు చేసి, ఆపై గండక్ నదికి పాములను ఊరేగింపుగా తీసుకువచ్చారు. కొన్ని ఆచారాలను నిర్వహించిన తరువాత మంత్రగాళ్లు నదిలో స్నానం చేసి, వారి చేతుల్లో పాములు పట్టుకొని నది నుంచి బయటకు రావడం అందరినీ ఆకట్టుకుంది.


స్థానికులు, ఇతర ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో జాతరను సందర్శించారు.పాముల జాతర ఒక అద్భుతం అని ప్రజలు నమ్ముతారు. పవిత్రమైన నాగుల పంచమి రోజున అన్ని కోరికలు నెరవేరతాయని ప్రజలు నమ్ముతారు.మరోవైపు పాముల జాతర తర్వాత పాములను సురక్షిత ప్రదేశాల్లో వదిలివేస్తామని భగత్‌లు చెప్పారు.


Updated Date - 2022-07-19T12:47:00+05:30 IST