జీడిమెట్లలో భారీ పేలుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన గోడౌన్

ABN , First Publish Date - 2021-12-18T20:14:33+05:30 IST

మేడ్చల్ : జిల్లాలోని జీడిమెట్ల సుభాష్ నగర్‌లోని భారీ పేలుడు సంభవించింది...

జీడిమెట్లలో భారీ పేలుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన గోడౌన్

మేడ్చల్ : జిల్లాలోని జీడిమెట్ల సుభాష్ నగర్‌లోని భారీ పేలుడు సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో పెద్ద ఎత్తున పేలుడు జరిగింది. కెమికల్ డబ్బాను కట్ చేస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు థాటికి ఒక్కసారిగా గోడౌన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరాతీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-12-18T20:14:33+05:30 IST