Abn logo
Sep 21 2021 @ 01:19AM

బాలికపై సామూహిక అత్యాచారం

యూపీలోని భోపా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 17 ఏళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారం చేసి.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సోమవారం విషయం వెలుగుచూసింది. జామ పండ్లు ఆశ చూపి ఆమెను ఆదివారం తోటలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. నిందితులు శుభమ్‌, ఆశిష్‌ పరారీలో ఉన్నారని పోలీ్‌సలు తెలిపారు.