వైభవంగా సామూహిక వివాహాలు

ABN , First Publish Date - 2022-05-23T19:03:24+05:30 IST

సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు. బళ్లారి నగరం రిజ్జమ్‌ ల్యాండ్‌ పాఠశాల ఆవరణంలో ఆది ఎడ్యుకేషనల్‌ ట్రస్టు, సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్టు

వైభవంగా సామూహిక వివాహాలు

- ఒక్కటైన 28 జంటలు 

బళ్లారిరూరల్‌/బళ్లారి సిటీ, మే 22 : సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు. బళ్లారి నగరం రిజ్జమ్‌ ల్యాండ్‌ పాఠశాల ఆవరణంలో ఆది ఎడ్యుకేషనల్‌ ట్రస్టు, సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో అధ్యక్షుడు వీరేష్‌ కుమార్‌ నేతృత్వంలో రెండవ సంవత్సరం ఉచిత సామూహిక వివాహాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 28 జంటలు ఒక్కటయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 131వ జయంతి, 889వ బసవ జయంతి సందర్భంగా రెండవ సంవత్సరం ఉచిత సామూహిక వివాహా లు నిర్వహించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీరాములు, రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, కల్యాణస్వామి, బళ్లారిలోని పలు వార్డు కార్పొరేటర్లు, ఉచిత సామూహిక వివాహాల్లో పాల్గొని 28 మంది నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలు గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పెద్దఎత్తున ప్రజలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు వక్తలు దాతల ఔదార్యాన్ని ప్రశంసించారు. పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర, బెంగళూరు సిటీ సి విల్‌ జడ్జీ రాఘవేంద్ర, కాంగ్రెస్‌ నాయకుడు సునీల్‌రావు, బీజేపీ నాయకుడు అబ్దుల్‌ అజీ జ్‌, సిద్దార్థ, అర్జున్‌, రైతు సంగనకల్లు కృష్ణప్ప, వీరేశ్‌కుమార్‌, ట్రస్టు సభ్యులు గంగాధర్‌, గురుసిద్దప్ప, శేకప్ప పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T19:03:24+05:30 IST