మాస్‌ క్రేజీ సాంగ్‌...

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక.  మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌  రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు. తాజాగా ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో సాంగ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ పాటలో విజయ్‌ మెడలో గొలుసులు, చేతికి ఉంగరాలతో ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ ట్విట్టర్‌లో తెలిపారు. ‘ముంబైలో లైగర్‌  సాంగ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. విజయ్‌ దేవరకొండ పర్‌ఫార్మెన్స్‌ చూశాక ఈ పోస్టు పెట్టకుండా ఉండలేకపోయాను. విజయ్‌ దేవరకొండ ఇదివరకూ ఎప్పుడూ చేయని విధంగా డ్యాన్స్‌ చేసి అలరిస్తాడు. నన్ను నమ్మండి. మాస్‌ క్రేజీగా ఉండబోతోంది.’ అని ఆమె ట్వీట్‌ చేశారు. పూరి జగన్నాథ్‌, ఛార్మీ, కరణ్‌ జోహర్‌ అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 


Advertisement