Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మసూర్‌ దాల్‌ కర్రీ

మసూర్‌ దాల్‌ కర్రీ

కావలసినవి: ఎర్ర కందిపప్పు - ఒక కప్పు, మెంతికూర - పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, జీలకర్ర - అర టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌.


తయారీ: ముందుగా ఎర్రకందిపప్పును నానబెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఎర్రకందిపప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసి కాసేపు వేగించాలి. తరువాత ధనియాల పొడి, గరంమసాల, పసుపు వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత మెంతి కూర వేయాలి. మెంతి బాగా వేగే వరకు చిన్నమంటపై ఉంచుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపుకోవాలి. అంతే... మసూర్‌ దాల్‌ కర్రీ రెడీ.



ఛోలే గుత్తి వంకాయ ఛోలే గుత్తి వంకాయ మామిడికాయ - పెరుగు పులుసుమామిడికాయ - పెరుగు పులుసుములక్కాడల కూరములక్కాడల కూరక్యాబేజీ చనా దాల్‌క్యాబేజీ చనా దాల్‌శ్రీలంక వంకాయకూరశ్రీలంక వంకాయకూరఆవాల ఆకుల కర్రీ ఆవాల ఆకుల కర్రీ కాజూ మసాలా కాజూ మసాలా ఆలూ మేతీఆలూ మేతీసాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీమేథీ బాజీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.