ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌

ABN , First Publish Date - 2022-08-04T05:11:33+05:30 IST

జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో తొలిరోజు బుధవారం మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ వేర్వేరు కేంద్రాల్లో 17 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది తెలుగు పరీక్ష రాస్తున్నవారే కావడం గమనార్హం.

ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌

తొలిరోజే 17 మందిని గుర్తించిన అధికారులు
కలెక్టరేట్‌, ఆగస్టు 3:
జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో తొలిరోజు బుధవారం మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ వేర్వేరు కేంద్రాల్లో 17 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది తెలుగు పరీక్ష రాస్తున్నవారే కావడం గమనార్హం. జిల్లాలోని 48 కేంద్రాల్లో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు, హిందీ, సాంస్కృతం వంటి సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరానికి సంబంధించి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 3807 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3560 మంది పరీక్ష రాశారు. రెండో సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగిన పరీక్షకు 2255 మంది హాజరు కావాల్సి ఉండగా 2051 మంది మాత్రమే రాశారు. పరీక్ష కేంద్రాలను సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఫస్టియర్‌లో 13 మంది, సెకెండియర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌ పాల్పడినట్లు ఆర్‌ఐవో మజ్జి ఆదినారాయణ తెలిపారు. అలాగే సార్వత్రిక విద్యా పీఠం ద్వారా నిర్వహించిన పరీక్షలకు సంబంధించి టెన్త్‌ పరీక్షలకు 229 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 179 మంది రాశారు. ఇంటర్‌ పరీక్షలకు 235 మంది హాజరు కావాల్సి ఉండగా 202 మంది రాశారు.
----------

Updated Date - 2022-08-04T05:11:33+05:30 IST