శృంగారానికీ మాస్క్‌!!

ABN , First Publish Date - 2020-06-06T07:44:02+05:30 IST

కరోనా కల్లోలం ముగిసేదాకా ముఖానికి మాస్క్‌ ధరించి సెక్స్‌లో పాల్గొనడం మంచిదని అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ

శృంగారానికీ మాస్క్‌!!

వాషింగ్టన్‌, జూన్‌ 5 : కరోనా కల్లోలం ముగిసేదాకా ముఖానికి మాస్క్‌ ధరించి సెక్స్‌లో పాల్గొనడం మంచిదని అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లైంగికంగా కలవడానికి ముందు, తర్వాత స్నానం చేయడంతో పాటు.. సెక్స్‌లో పాల్గొన్న ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ముద్దు పెట్టే క్రమంలోనూ మాస్క్‌ను తొలగించకపోవడం శ్రేయస్కరమన్నారు. ఈ వివరాలతో ఓ అధ్యయన నివేదిక ‘అనల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. 

Updated Date - 2020-06-06T07:44:02+05:30 IST