Abn logo
Mar 30 2020 @ 04:48AM

మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచండి

  • రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌పీపీఏ చైర్‌పర్సన్‌ లేఖ

న్యూఢిల్లీ, మార్చి 29: కరోనా వైరస్‌ నేపథ్యంలో  మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) చైర్‌పర్సన్‌ శుభ్రా సింగ్‌ లేఖ రాశారు. మందులు, వైద్య పరికరాల ఉత్పత్తి, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని కోరారు. మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్ల తయారీదారుల వివరాలు అందుబాటులో లేక ఆర్డర్లు ఇచ్చే విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలు ఎదుర్కొన్నాయన్నారు. అందువల్ల అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మాన్యుఫాక్చరర్స్‌ అఫ్‌ మెడికల్‌ డివైస్‌ ఇండస్ర్టీ వారు పంపిన ఉత్పత్తిదారుల జాబితాను కూడా ఆ లేఖతో జతపరిచి పంపారు.

Advertisement
Advertisement
Advertisement