Abn logo
Apr 14 2021 @ 00:00AM

మాస్క్‌...మస్త్‌

కొవిడ్‌ దెబ్బకు మఖానికి మాస్క్‌ తప్పనిసరైంది. డ్రెస్‌లో భాగమైపోయింది. అందుకే ఫ్యాషన్‌ డిజైనర్లు కూడా తమ కలెక్షన్లలో మాస్క్‌ను చేర్చారు. దీంతో విభిన్నమైన మాస్క్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. క్యాట్‌వాక్‌ల్లో మోడళ్ల ముఖాలకు అందంగా అలంకరించుకొంటున్నాయి. లాక్మే, న్యూయార్క్‌... మరే ఫ్యాషన్‌ షో అయినా మాస్క్‌లు ఆహార్యంలో భాగమయ్యాయి. ఈ చిత్రాలు ఇటీవల స్పెయిన్‌లో జరిగిన ‘మాడ్రిడ్‌ ఫ్యాషన్‌ వీక్‌’లోనివి. వివిధ డిజైన్లు... రంగురంగుల మాస్క్‌ల్లో ముద్దుగుమ్మలు మెరిసి మురిపించారు. ప్రముఖ డిజైనర్‌ హన్నిబల్‌ లగునా  వీటిని రూపొందించారు. 

ప్రత్యేకం మరిన్ని...