మష్రూమ్‌తో...

ABN , First Publish Date - 2020-08-08T19:13:51+05:30 IST

మష్రూమ్స్‌(పుట్టగొడుగులు) - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, టొమాటోలు - రెండు, జీలకర్ర -

మష్రూమ్‌తో...

కావలసినవి: మష్రూమ్స్‌(పుట్టగొడుగులు) - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, టొమాటోలు - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, గరంమసాలా - పావుటీస్పూన్‌, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట.


తయారీ: మష్రూమ్స్‌ను శుభ్రంగా కడగాలి. పెద్దగా ఉంటే రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలను తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిన తరువాత కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత టొమాటో ముక్కలు, పసుపు వేసి కలియబెట్టాలి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి. టొమాటో ముక్కలు ఉడికిన తరువాత ధనియాల పొడి, కారం, జీలకర్రపొడి వేసి కలపాలి. ఇప్పడు మష్రూమ్స్‌ వేసి కలియబెట్టాలి. మూతపెట్టి చిన్న మంటపై ఐదునిమిషాలు ఉడికించాలి. తగినంత ఉప్పు వేయాలి. మూతపెట్టి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా గరంమసాలా వేయాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే మష్రూమ్‌ కూర రెడీ.


Updated Date - 2020-08-08T19:13:51+05:30 IST