మసాలా బ్రెడ్‌ ఉప్మా

ABN , First Publish Date - 2021-11-17T19:21:00+05:30 IST

బ్రెడ్‌ ముక్కలు- మూడు కప్పులు, ఉల్లి ముక్కలు- కప్పు, అల్లం ముక్కలు - స్పూను, పచ్చి మిర్చి

మసాలా బ్రెడ్‌ ఉప్మా

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు- మూడు కప్పులు, ఉల్లి ముక్కలు- కప్పు, అల్లం ముక్కలు -  స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, టొమాటో ముక్కలు- కప్పు, పసుపు, కారం- అర స్పూను, పోపు గింజలు- స్పూను, ఇంగువ- చిటికెడు, కరివేపాకు, కొత్తిమీర తరుగు- స్పూను.


తయారుచేసే విధానం: ఓ పాన్‌లో నూనె వేసి పోపు గింజల్ని చిటపటలాడించాలి. ఇంగువ, కరివేపాకు ఆకులు వేయాలి. పచ్చి మిర్చి, అల్లం, ఉల్లి ముక్కలు కలిపి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి మగ్గించాలి. పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో బ్రెడ్డు కూడా వేసి మూతపెట్టాలి. తక్కువ మంట మీద రెండు నిమిషాలు ఉడికించి స్టవ్‌ కట్టేయాలి. పైన కొత్తిమీర తురుము జల్లితే మసాలా బ్రెడ్‌ ఉప్మా సిద్ధం. టొమాటో సాస్‌తో ఈ ఉప్మా రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-11-17T19:21:00+05:30 IST