ఉచిత సర్వీసును జూన్ 30 వరకు పొడిగించిన ‘మారుతి’

ABN , First Publish Date - 2020-05-30T21:56:47+05:30 IST

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించే అవకాశం

ఉచిత సర్వీసును జూన్ 30 వరకు పొడిగించిన ‘మారుతి’

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆటోమేకర్లు అందరూ తమ వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నారు. అంటే ఉచిత సర్వీసు, వారెంటీ, ఎక్స్‌టెండెడ్ వారెంటీస్ వంటి వాటిని కోల్పోకుండా వాటి గడవును పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మారుతీ సుజుకి ఉచిత సర్వీసు, వారెంటీ, ఎక్స్‌టెండెడ్ వారెంటీని జూన్ 30 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. మార్చి 15- ఏప్రిల్ 30 మధ్య కాలపరిమితి ముగిసే వాటిని జూన్ 30 వరకు పెంచుతున్నట్టు తెలిపింది. ఫలితంగా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వినియోగదారులకు తగినంత సమయం ఉంటుందని తెలిపింది.

Updated Date - 2020-05-30T21:56:47+05:30 IST