మారుతి లాభం రూ.1,036 కోట్లు

ABN , First Publish Date - 2022-07-28T08:43:35+05:30 IST

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ)..

మారుతి లాభం రూ.1,036 కోట్లు

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ).. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,036 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.475 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా రెండింతలు వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.17,776 కోట్ల నుంచి రూ.26,512 కోట్లకు పెరిగింది. కాగా స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.25,286 కోట్ల ఆదాయంపై రూ.1,013 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 

Updated Date - 2022-07-28T08:43:35+05:30 IST