Abn logo
May 22 2020 @ 12:49PM

మారుతి వెబ్ సిరీస్‌..?

ప్ర‌స్తుతం సినిమా రంగంలో ఉన్న ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు ఓటీటీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో పూర్తి స్థాయి తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఆహా. నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలో ఆహాలో కాన్సెప్ట్‌లు రూపొందుతున్నాయి. అర‌వింద్ ప‌లువురు ద‌ర్శ‌కుల‌ను క‌లిసి కొత్త కాన్సెప్ట్‌ల‌తో వెబ్ సిరీస్‌ల‌ను చేయ‌మంటున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌క నిర్మాత మారుతితో కూడా అర‌వింద్ చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. అర‌వింద్ కోరిక మేర‌కు ట్రెండ్‌కు త‌గిన‌ట్లు ఓ వెబ్‌సిరీస్‌ను మారుతి తెరకెక్కించ‌నున్నార‌ని టాక్‌. మ‌రి సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతోన్న ఈ వార్త‌ల‌పై మారుతి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement