Advertisement
Advertisement
Abn logo
Advertisement

వచ్చే నెల నుంచి పెరగనున్న మారుతీ సుజుకి ధరలు...

న్యూఢిల్లీ : దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి  సుజుకీ ఇండియా మరోసారి ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఇన్‌పుట్ వ్యయాల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించుకునే క్రమంలో... జనవరి నుంచి ధరలను పెంచాలని యోచిస్తోంది. ‘గత సంవత్సరంలో వివిధ ఇన్‌పుట్ వ్యయాల పెరుగుదల కారణంగా కంపెనీ వాహనాల ధరలు ప్రతికూలంగా ప్రభావితమవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో...  ధరల పెంపు ద్వారా... అదనపు ఖర్చుల నుంచి కొంత భారాన్ని వినియోగదారులపై  మోపడం కంపెనీకి అత్యవసరంగా మారింది’ అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతీ సుజుకి పేర్కొంది. ధరల పెరుగుదల జనవరి 2022 నాటినుంచి అమలుకానుంది. మారుతి సుజుకి వివిధ మోడళ్లకు సంబంధించిన పెరుగుదల మారుతూ ఉంటుంది. కంపెనీ దేశంలో హ్యాచ్‌బ్యాక్ ఆల్టో నుంచి S-క్రాస్ ఎస్‌యూవీ వరకు పలు రకాల మోడళ్లను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement