భారత్ లోనే... మారుతి సుజుకి ‘విద్యుత్తు వాహనం’ లాంచింగ్...

ABN , First Publish Date - 2021-07-21T01:25:21+05:30 IST

ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్‌... విద్యుత్తు వాహనాల తయారీ దిశగా అడుగులు వేస్తోంది.

భారత్ లోనే... మారుతి సుజుకి ‘విద్యుత్తు వాహనం’ లాంచింగ్...

న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్‌... విద్యుత్తు వాహనాల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. మారుతి భాగస్వామ్యంతో భారత్‌లో సుజుకి తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరో నాలుగేళ్ళ నాటికి భారత్‌లో విద్యుత్తు వాహనాలను మార్కెట్‌లోకి  ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పనులు ప్రారంభించింది. తమ సంస్థ నుంచి తయారుకానున్న తొలి విద్యుత్తు వాహనాన్ని భారత్‌లోనే  లాంచ్‌ చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ ఒక నివేదికలో వెల్లడించింది.


కంపెనీ తీసుకున్న నిర్ణయంతో కాంపాక్ట్ కార్ల విభాగంలో జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాల వృద్ధికి మరింత దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. భారత్‌లో మారుతి సుజుకీ అమ్మకాల్లో వాగన్ ఆర్, ఆల్టో, స్విఫ్ట్ వంటి చిన్న కాంపాక్ట్ కార్లు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. విద్యుత్తు వాహనాన్ని తొలుత భారత మార్కెట్‌లో విడుదల చేసిన అనంతరం జపాన్‌, యూరప్‌ దేశాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకీ... ‘వాగన్‌ ఆర్‌’ వాహనాలను విద్యుత్తు వాహనంగా పరీక్షిస్తున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2021-07-21T01:25:21+05:30 IST