భవిష్యత్‌ ఆశాజనకం

ABN , First Publish Date - 2020-09-28T06:16:17+05:30 IST

ప్రస్తుతం కష్టాలు ఉన్నా, దీర్ఘకాలంలో దేశంలో కార్ల అమ్మకాలకు ఢోకా ఉండదని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు...

భవిష్యత్‌ ఆశాజనకం

  • మారుతీ సుజుకీ 

న్యూఢిల్లీ: ప్రస్తుతం కష్టాలు ఉన్నా, దీర్ఘకాలంలో దేశంలో కార్ల అమ్మకాలకు ఢోకా ఉండదని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే దీర్ఘకాలంలో వాహనాల డిమాండ్‌, ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ఆధారపడి ఉంటాయన్నారు. దీర్ఘకాలికంగా చూస్తే భారత జీడీపీ వృద్ధి రేటుకు ఢోకా లేనందున, వాహనాల అమ్మకాలకూ ఢోకా ఉండదని భావిస్తున్నట్టు శ్రీవాస్త వ తెలిపారు.


కొవిడ్‌ నేపథ్యంలో పరిశ్రమ స్వల్పకాలిక భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఊహించటం మాత్రం కష్టమన్నారు. ఉత్పత్తి, అమ్మకాలు సాధారణ స్థితికి చేరేందుకూ చాలా కాలం పడుతుందన్నారు. అయితే పండుగల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నెలలో ఉత్పత్తి పెంచినట్టు చెప్పారు. ధరల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 

Updated Date - 2020-09-28T06:16:17+05:30 IST