ఇక... మారుతి సీఎన్‌జీ కార్లు...

ABN , First Publish Date - 2021-02-23T00:35:40+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతోన్న నేపధ్యంలో... శంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి... కంప్రస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)తో నడిచే కార్ల తయారీపై దృష్టి సారించింది.

ఇక... మారుతి సీఎన్‌జీ కార్లు...

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతోన్న నేపధ్యంలో... శంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి...  కంప్రస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)తో నడిచే కార్ల తయారీపై దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీతో నడిచే కార్ల అమ్మకాలు 59 శాతం వరకు పెరుగొచ్చని అంచనా వేసింది.


పెట్రోల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతోపాటు గ్యాస్‌ యొక్క విస్తఅత లభ్యత నేపధ్యంలో... అధిక సంఖ్యలో వినియోగదారులు సీఎన్‌జీపై దృష్టి పెడుతోన్నారని పేర్కొంది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను తీర్చడానికి తాము సిఎన్‌జి వాహనాల తయారీని విస్తరించాలని భావిస్తోన్నట్లు మారుతి సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఎగ్జ్సిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Updated Date - 2021-02-23T00:35:40+05:30 IST