Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 14:21:41 IST

Maruthi: ప్రభాస్ మూవీ తర్వాతే ఏదైనా..?

twitter-iconwatsapp-iconfb-icon

ప్రభాస్ (Prabhas) మూవీ తర్వాతే ఏదైనా..? అంటున్నారట దర్శకుడు మారుతి (Maruthi). వీరి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటికే, సెట్స్‌పైకి వెళ్ళాల్సిన సినిమా ప్రభాస్‌కి వరుస ఫ్లాప్స్ పడటంతో మారుతి తను అనుకున్న కథలో కీలక మార్పులు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అది నిజమేనని తెలుస్తోంది. మారుతి గత చిత్రం పక్కా కమర్షియల్ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ప్రభాస్ సినిమాతో భారీ హిట్ కొట్టాలని కసితోనే పూర్తిగా తన దృష్టి మొత్తం ఈ మూవీ కథపైనే పెట్టారట.

ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి జీఏ 2 నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి. ఇప్పటికే, ఈ మూవీ కోసం భారీ సెట్స్ కూడా సిద్ధం అవుతున్నాయట. ప్రస్తుతం ప్రభాస్ ఒకవైపు సలార్ (Salaar) సినిమా షూటింగ్‌ను చేస్తూనే నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) అనే పాన్ వరల్డ్ మూవీని పూర్తి చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న సలార్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనిలో శృతి హాసన్ హీరోయిన్. హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది.

ఇక ప్రాజెక్ట్ K సినిమా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో అగ్ర నిర్మాత సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణ సంస్థకి 50 వ సినిమా కావడం విశేషం. దీపిక పడుకొన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్ కూడా షూటింగ్ పూర్తై వీఎఫెక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఈ మూడు సినిమాలకు పూర్తి భిన్నంగా, మారుతి.. ప్రభాస్ కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాతే మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారట. మరి ఎలాంటి కథలో ఎంత కొత్తగా డార్లింగ్‌ను సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement