అమరవీరులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-13T05:42:22+05:30 IST

స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవాలని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అన్నారు.

అమరవీరులను స్మరించుకోవాలి
జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

- ప్రతి ఉద్యోగి ఇంటిపైన జెండా ఎగురవేయాలి 

- ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ

గోదావరిఖని, ఆగస్టు 12: స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవాలని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం 24మీటర్ల జాతీయ జెండాతో ఫ్రీడం ఫర్‌ రన్‌ను నిర్వహించారు. ఈ రన్‌ జీఎం ఆఫీస్‌ నుంచి రాజీవ్‌ రహదారి రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ భారత్‌ వజ్రో త్సవాలను నిర్వహిస్తుందని, హర్‌ ఘర్‌ తిరంగ్‌ పేరిట ప్రతి ఇంటి  పైన ఉద్యోగులు జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్‌జీ-1 ఏరియాలో సింగరేణి ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగిందని, శనివారం నుంచి మూడు రోజుల పాటు  ఇంటిపై జెండాలు ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో డీజీఎం(పర్సనల్‌) లక్ష్మీనారాయణ, అధికారులు రామకృష్ణ, అధికారులు సాంబశివరావు, తిరుపతిరెడ్డి, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ బంగారు సారంగపాణి, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, స్పోర్ట్స్‌ సూపర్‌వై జర్‌ రమేష్‌, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:42:22+05:30 IST