Abn logo
Oct 22 2021 @ 01:11AM

అమరవీరులు ధన్యజీవులు: జీఆర్పీ ఎస్పీ

అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి, నివాళులర్పిస్తున్న జీఆర్పీ ఎస్పీ అనిల్‌బాబు

గుంతకల్లు, అక్టోబరు 21: పోలీసు విధి నిర్వహణలో అమరులైన వా రు జన్మ సార్థకతను పొందిన ధన్యజీవులని జీఆర్పీ ఎస్పీ పీ అనిల్‌బాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అ మరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  అమరవీరుల స్తూపం చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. ఈసందర్భంగా మృతి చెందిన పోలీసు కుటుంబీకులను ఎస్పీ పరామర్శించారు. వారి సతీమణులకు శాలువాలను అందజేసి సన్మానించారు. గుండెధైర్యంలో జీవించాలని తెలియజేశారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. మరణించిన పోలీసు ఉద్యోగులకు డిపార్టుమెంట్‌ నుంచి రావాల్సిన సెటిల్మెంట్ల విషయంగా ప్రశ్నించి పెండింగులో ఉ న్న బెనిఫిట్లను వెంటనే విడుదల చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయ ఏఓ శ్రీనివాసరావు, ఆర్‌ఐ రామాంజనేయులు, ఆర్‌ఎ్‌సఐ మాద ప్ప, సుబ్బరాజు, రవికుమార్‌ పాల్గొన్నారు. 


రాయదుర్గంటౌన: పోలీసుల త్యాగనిరతిని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీ సుకుని ముందుకెళ్లాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా పట్టణంలోని వినాయ క సర్కిల్‌లో అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అర్బన సీఐ సురేష్‌ బాబు, మున్సిపల్‌ చైర్‌పర్సన పొరాళ్లు శిల్ప, కౌన్సిలర్‌ ఆఫ్గాన ఫకృద్దీన, హౌసింగ్‌ కార్పొరేషన డైరెక్టర్‌ ఇల్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: స్థానిక పోలీ్‌సస్టేషన ఆవరణలోని పోలీ్‌సపార్కులో గు రువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు.  డీఎస్పీ అంతోనప్ప అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో సీఐలు తేజోమూర్తి, శ్రీనివాస్‌, ఎస్‌ఐ ఆశాబేగం, ఏఎ్‌సఐలు రాజశేఖర్‌, నారాయణరెడ్డి, ఖాదర్‌బాషా, హెడ్‌ కానిస్టేబుళ్లు జైకుమా ర్‌, కృష్ణారెడ్డి, విజయరామరాజు, రమేష్‌ పాల్గొన్నారు.  


ఉరవకొండ: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని సీఐ శేఖ ర్‌ పేర్కొన్నారు. పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని హెడ్‌కానిస్టేబుల్‌ గురికాల శివప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆర్డీటీ బుద్ధిమాంద్య పాఠశాలలో పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.   అనంతరం అనాథ ఆశ్రమంలో వద్ధులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రీజనల్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, ఏటీఎల్‌ నల్లపరెడ్డి పాల్గొన్నారు.  


యల్లనూరు: పోలీసు అమరవీరుల స్మారక దినాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక పోలీ్‌సస్టేషనలో పోలీసులు నివాళులర్పించారు. ఈ సం దర్భంగా విధుల్లో అమరులైన పోలీసుల ఆత్మకు శాంతికలగాలని ఎస్‌ఐ జ గదీష్‌, సిబ్బంది మౌనం పాటించారు.