Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 22 Jan 2022 20:14:50 IST

తెర మీద నరమాంస భక్షకుడు... భయంతో నిజ జీవితంలో HOLLYWOOD బ్యూటీ బ్రేకప్!

twitter-iconwatsapp-iconfb-icon
తెర మీద నరమాంస భక్షకుడు... భయంతో నిజ జీవితంలో HOLLYWOOD బ్యూటీ బ్రేకప్!

మార్తా స్టీవార్ట్... హాలీవుడ్ సీనియర్ నటి. ఆమె ఒకప్పుడు వెటరన్ యాక్టర్ సర్ ఆంథోనీ హాప్‌కిన్స్‌కు బాగానే దగ్గరైంది. అయితే, అతడితో రిలేషన్‌కి మార్తా అనూహ్యంగా బ్రేకప్ చెప్పేసింది. ఇదంతా జరిగి దశాబ్దాలు గడిపోతుండగా... తాజాగా 80 ఏళ్ల లెజెండ్రీ లేడీ అనాటి అసలు కారణం ఓ టెలివిజన్ షోలో బయటపెట్టింది.


సర్ ఆంథోనీ హాప్‌కిన్స్ 1991 నాటి సినిమా ‘ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్’లో హ్యానిబల్ లెక్టర్‌గా నటించాడు. అతడి పాత్ర మనుషుల్ని తినేస్తుంటుంది! అయితే, నరమాంసం భక్షించే ఆ క్యానిబల్ క్యారెక్టర్ మార్తా మీద ఎంత ప్రభావం చూపిందంటే... నిజ జీవితంలో కూడా దాన్నుంచీ వేరు చేసి హాప్‌కిన్స్‌ని ఆమె చూడలేకపోయింది. అతడితో రొమాన్స్‌కి గుడ్ బై చెప్పేసి బ్రేకప్ అనేసింది. పైగా ‘‘నాకు ఓ పెధ్ద ఇల్లొకటి ఉండేది. అక్కడికి ఆంథోనిని తీసుకు వెళ్లాలనే ఊహ కూడా నేను చేయలేకపోయేదాన్ని. నాకు ఎప్పుడూ అతడు ‘తినేస్తున్న’ దృశ్యమే కనిపించేది...’’ అంది మార్తా స్టీవార్ట్!


తెర మీద నరమాంస భక్షకుడిగా నటించిన ఆంథోనీ హాప్‌కిన్స్ స్వయాన ఆయన ప్రియురాలే భయపడిపోయేలా నటించినందుకు మనం మెచ్చకుని తీరాలి. అయితే, నటుడిగా నెగ్గిన ఆయన ప్రియుడిగా మాత్రం నష్టపోక తప్పలేదు...   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement