ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుతకు మంగళం !

ABN , First Publish Date - 2022-05-27T05:57:30+05:30 IST

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుతకు మంగళం పాడే దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తోంది. ఆ వర్గాలు పట్ణణాలు, నగరాల్లో ఉంటే సబ్సిడీ కట్‌ చేయనుంది

ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుతకు మంగళం !
విద్యుత శాఖ ప్రధాన కార్యాలయం

అనంతపురంరూరల్‌, మే 26: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుతకు మంగళం పాడే దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తోంది. ఆ వర్గాలు పట్ణణాలు, నగరాల్లో ఉంటే సబ్సిడీ కట్‌ చేయనుంది. ఇప్పటికే విద్యుత శాఖ దళిత వాడలో ఉన్నవారేందరు. పట్టణాలు, నగరాల్లో ఉన్నావారేం దరు అని తేల్చేపనిలో పడింది. ఆమేరకు ఉమ్మడి జి ల్లాలో విద్యుత శాఖ అధికారులు సర్వే నిర్వహణ మొదలు పెట్టారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివాసమున్న వారికి మాత్రమే రాయితీ వర్తింప చేయనున్నారు.


1.58లక్షల ఎస్సీ, ఎస్టీ  విద్యుత వినియోగదారులు

ఉమ్మడి జిల్లాలో 1,58,103 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత విని యోగదారులున్నారు. వీరు నెలకు 10 మిలియన యూని ట్లకు పైగా విద్యుతను వినియోగిస్తున్నారు. ఇందులో ఎస్సీ వినియోగదారులు 1,23,896 మంది ఉన్నారు. వీరిలో 108,562 మందికి ఉచిత విద్యుత వర్తింపు జరుగుతోంది.   34,207 మంది ఎస్టీ వినియోగదారులున్నారు. ఇందులో 29,065 మందికి ఉచిత విద్యుత(200యూనిట్లలోపు) వర్తిస్తోంది. ఈ లెక్కన ఎస్సీ వినియోగదారులకు రూ.2కో ట్లు, ఎస్టీ వినియోగదారులకు రూ.55లక్షలు ప్రభుత్వం సబ్సిడీ రూ పంలో విద్యుత పంపిణీ సంస్థలకు చెల్లిస్తోంది. 


ఉచితానికి మంగళం పాడేందుకేనా..?

ఎస్సీ, ఎస్టీ విద్యుత వినియోగదారులకు ప్రస్తుతం నెలకు 200యూనిట్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఆ మేరకు చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కోసం దళిత వాడల్లో ఉన్నవారికి మాత్రమే 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత వర్తింపునకు పావులు కదుపుతోందన్న వాదనలు ఆయావర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆర్థికంగా ఉన్నవారు నగరం, పట్టణాల్లో నివాసముంటున్నారు. దళిత వాడల్లో ఉండటం లేదని, దళిత వాడల్లో ఉన్న వారికి మాత్రమే ఉచిత విద్యుత వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దళితవాడల్లో, పట్టణ, నగరాల్లో ఉన్న వారి లెక్కలేల్చాలని విద్యుత పంపిణీ సంస్థలకు సూచించింది. ఈక్రమంలోనే విద్యుత పంపిణీ సంస్థ ఏపీ ఎప్సీడీసీఎల్‌ ఇటీవల వివరాల సేకరణకు చర్యలు చేప ట్టింది. దీంతో ఆయావర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 


ఆదేశాలు వచ్చాయి..

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఎంత మంది ఉన్నారు. పట్టణ, నగరాల్లో ఎంత మంది ఉన్నారు అన్న వివరాలను సేకరిస్తున్నాం. ఆమేరకు ఇటీవల సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వివరాల సేకరణ అనంతరం దళిత వాడల్లో ఉన్న వారికి మాత్రమే 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత అందిస్తాం. 

- నాగరాజు, ఎస్‌ఈ, విద్యుత శాఖ


Updated Date - 2022-05-27T05:57:30+05:30 IST