‘సూక్ష్మ’భారం!

ABN , First Publish Date - 2021-07-31T04:38:15+05:30 IST

అన్నదాతపై సూక్ష్మ పోషకాల భారం పడుతోంది. మరోవైపు పంట పోషకాల విషయంలో ప్రభుత్వం రాయితీలకు మంగళం పడింది. బయట మార్కెట్‌లో అదనపు ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాగు ప్రారంభంలో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెచ్చినా.. జింకు, బోరాన్‌, జిప్సం వంటి సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందించడం లేదు. దీనికితోడు వీటిపై రాయితీలు ఎత్తి వేయడంతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. 2018 ఖరీఫ్‌ వరకూ వీటిని ఉచితంగా అందించేవారు.

‘సూక్ష్మ’భారం!




సూక్ష్మ పోషకాలపై రాయితీలకు మంగళం

ఈ ఖరీఫ్‌ నుంచే ఎత్తివేత

ఆందోళనలో రైతులు

 (నెల్లిమర్ల)

- నెల్లిమర్ల మండలం గరికిపేటలో ఓ రైతు ఇటీవలే వరి నాట్లు వేశాడు. వరి ఆకులో మధ్య ఈనె వాలిపోతోంది. పెళుసు కట్టి ఆకులు విరిగిపడుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయిస్తే జింకు లోపంగా చెబుతున్నారు. వారిచ్చిన సలహాతో సస్యరక్షణ చేపట్టాడు.

- వల్లూరుకు చెందిన ఓ రైతు పొలంలో వరి ఆకు తెల్లగా మారుతోంది. ఎరువులు వేసినా రంగు మారడం లేదు. దీంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయిస్తే ఇనుము ధాతువు లోపమని తేల్చారు. దీంతో వెనువెంటనే సూక్ష్మ పోషకాలు కొనుగోలుచేసి పిచికారీ చేశాడు. 

-- ఇలా అన్నదాతపై సూక్ష్మ పోషకాల భారం పడుతోంది. మరోవైపు పంట పోషకాల విషయంలో ప్రభుత్వం రాయితీలకు మంగళం పడింది. బయట మార్కెట్‌లో అదనపు ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాగు ప్రారంభంలో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెచ్చినా.. జింకు, బోరాన్‌, జిప్సం వంటి సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందించడం లేదు. దీనికితోడు వీటిపై రాయితీలు ఎత్తి వేయడంతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. 2018 ఖరీఫ్‌ వరకూ వీటిని ఉచితంగా అందించేవారు. 2019 రబీ నుంచి 50 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ఈ ఏడాది నుంచి పూర్తిగా రాయితీ ఎత్తివేశారు. దీంతో పూర్తిస్థాయి ధర చెల్లించి కొనుగోలు చేయడం రైతుకు భారంగా పరిణమించింది. ఖరీఫ్‌లో సుమారు 1400 టన్నులకుపైగా  సూక్ష్మ పోషకాలు అవసరం. ప్రస్తుతం మార్కెట్లో టన్ను జింకు ధర రూ.53,200 పలుకుతోంది. జిప్సం రూ.2,827, బోరాన్‌ రూ.97 వేలుగా ఉంది. ఈ లెక్కన ఒక్క ఖరీఫ్‌లోనే రూ.2 కోట్ల భారం రైతులపై పడుతోంది.  


 భూసార పరీక్షలదీ అదే తీరు

భూసార పరీక్షల తీరూ అదే విధంగా ఉంది. మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలి. వాటి ఫలితాల ఆధారంగా విత్తన ఎంపిక, సస్యరక్షణ చేపట్టాల్సి ఉంది. ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 1,81,811 హెక్టార్లలో సాగవుతున్నాయి. కానీ భూసార పరీక్షలు సగం కూడా జరగని పరిస్థితి నెలకొంది. ఇటీవల అగ్రి ల్యాబ్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. కొంతమంది రైతులు రైతు భరోసా కేంద్రాల్లోని మినీ ల్యాబ్‌లను ఆశ్రయించి భూసార పరీక్షలు చేయిస్తున్నారు. చాలామంది రైతులకు అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరముంది. 


11111111111111111111111111111111

Updated Date - 2021-07-31T04:38:15+05:30 IST