ప్రతీఒక్కరు వివాహ నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-29T05:58:55+05:30 IST

ప్రతీఒక్కరు వివాహ తేదీని నమోదు చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో పంచాయతీ కార్యదర్శులకు వివాహ చట్టం-2002 పై శనివారం అవగాహన కార్యక్రమాన్ని శనివారం స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ శాఖలకు సంయుక్తంగా నిర్వహించారు.

ప్రతీఒక్కరు వివాహ నమోదు చేసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ 

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 28: ప్రతీఒక్కరు వివాహ తేదీని నమోదు చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో పంచాయతీ కార్యదర్శులకు వివాహ చట్టం-2002 పై శనివారం అవగాహన కార్యక్రమాన్ని శనివారం స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ శాఖలకు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ విభిన్న మతాలు, కులాలు వారివారి ఆచార వ్యవహారాలకు అనుగునంగా వివాహాలు నిర్వహిస్తారని, అయినప్పటికీ చట్ట ప్రకారం వివాహాలను నమోదు చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉం టుందన్నారు. 1994లో వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, తదనుగుణంగా 2002లో సవరణలు చేయం జరిగిందని తెలిపారు. వివాహ నమోదు చేసుకునే వధూవరులు వారి వివరాలతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలు, సాక్షుల వివరాలతో నిర్ణీత ప్రొఫార్మాలో ఆయా గ్రామ పంచాయతీల్లో వివాహ నమోదు అధికారులుగా నియమించబడిన పంచాయతీ కార్యదర్శుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. పురుషుడి వయస్సు 21 సంవత్సరాలు, స్ర్తీ వయస్సు 18 సంవత్సరాలు ఉండాలన్నారు. బాల్య వివాహాలను అనుమతించకూడదని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లయితే వాటిని నిలిపి వేయాలని సూచించారు. చట్టబద్ధంగా వివాహ నమోదు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో వచ్చే సమస్యలు చట్టబద్ధంగా పొందవచ్చని సూచించారు. అదేవిధంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తప్పుడు వివాహ నమోదు చేసుకున్నట్లయితే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హిందూ వివాహ చట్టం-1956 ప్రకారం విడాకులు పొందిన వారు, ఎలాంటి ఆధారం లేకుంటే రెండో పెళ్లి చేసుకోవచ్చని, వివిధ కారణాల వలన మొదటి భార్య సమ్మతిస్తే, కోర్టు అనుమతిస్తే రెండో వివాహం చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాలలో జరిగే వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, నిర్ణీత రిజిస్టర్‌ను ప్రతీ గ్రామ పంచాయతీల్లో నిర్వహించాలని, ప్రతీనెల నివేదికలు సంబంధిత అధికారులకు నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల సందర్శనలో భాగంగా అధికారులు ఆయా రికార్డును పరిశీలించవచ్చని, రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఆ తర్వాత జడ్పీ సీఈవో షన్‌ మాట్లాడుతూ చట్టం ప్రకారం వివాహ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్క మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధానికి కమిటీలు వేయడం జరిగిందని, బాల్య వివాహాలను నిరోధించి, ఇందుకు 1098 హెల్ప్‌లైన్‌ వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాథోడ్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, ఉద్యానవన అధికారి శ్రీనివా్‌సరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేకాధికారులు క్షేత్ర పర్యటనలో పనులను పరిశీలించాలి

ఆదిలాబాద్‌ టౌన్‌: ‘పల్లె ప్రగతి’ పనులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, జాతీయ ఉపాధి హామీ పనులను మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర పర్యటన నిర్వహించి పరిశీలించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. శనివారం స్థానిక టీటీడీసీలో మండల ప్రత్యేక అధికారులతో పల్లె ప్రగతి, మరుగుదొడ్ల నిర్మాణం, జాతీయ ఉపాధి హామీ పను లు, పారిశుధ్యం, కొవిడ్‌-19 వాటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం కింద చేపట్టే రైతు వేదికలు, శశ్మశాన వాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్‌లు, డ్రైయింగ్‌ ప్లాట్‌ ఫాంలు, పల్లె ప్రకృతి వనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పంచాయతీ పన్ను ల వసూళ్లు, జాతీయ ఉపాధి హామీ పనులు అంశాలపై సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లోని గ్రామాలలో చేపట్టే పనులను క్షుణంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో 101 రైతు వేదికల నిర్మాణాలకు గాను ఇంకా 18 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, వాటిని వెంటనే పూర్తి చేయించాలని సూచించా రు. ఇందులో జడ్పీ సీఈవో కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రాథోడ్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ మహావీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:58:55+05:30 IST