Abn logo
Apr 1 2021 @ 07:56AM

వేరొకరితో భర్త వివాహేతర సంబంధం.. భార్య బలవన్మరణం

  • భర్త, మామ, మరో మహిళ కారణమంటున్న మృతురాలి బంధువులు
  • కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న అలిపిరి పోలీసులు 

తిరుపతి : ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం తిరుపతిలో చోటుచేసుకుంది. ఐతే తన అల్లుడు, ఆయన తండ్రి, అల్లుడితో వివాహేతర సంబంధం కలిగిన మరో మహిళ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపిస్తు న్నారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ వెల్లడించిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటగిరి దొమ్మరపాళ్యంకు చెందిన  సాలపక్ష రాజయ్య, పోలమ్మ దంపతుల కుమార్తె చంద్రకళ (35)కు, కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన మన్నెపూల వనస్వామి కుమారుడు నాగరాజుతో 16 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. 


వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగరాజు కొయ్యబొమ్మలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తిరుపతికి వచ్చిన నాగరాజు ఎస్‌ఎల్‌వీ నగర్‌లో కుటుంబంతో కాపురం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన మునికుమారమ్మ అనే మహిళతో వివాహేత సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఎస్‌ఎల్‌వీ నగర్‌లోనే కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన చంద్రకళ భర్తను నిలదీసింది. దీంతో నాగరాజు ప్రతీరోజూ భార్యను హింసించేవాడు.

నాగరాజుకు ఆయన తండ్రి మునస్వామి కూడా తోడవడంతో చంద్రకళను మరింతగా హింసించేవాడు. ఇదిలా ఉండగా మీ కుమార్తె ఉరివేసుకుని చనిపోయిందని నాగరాజు సోదరుడు జయకిరణ్‌ బుధవారం ఫోన్‌చేసి చెప్పాడని, తన కుటుంబ సభ్యులు, బంధువులతో నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చి చూడగా తన కుమార్తె చనిపోయి కనిపించిందని ఆమె వెల్లడించారు. తన అల్లుడు, ఆయన తండ్రి, నాగరాజుతో వివవాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వీరు ముగ్గురు కలిసి చిత్రహింసలు పెట్టినందునే తమ కుమార్తె ఉరివేసుకుని చనిపోయిందంటూ అలిపిరి పోలీసులకు మృతురాలి తల్లి పోలమ్మ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement