Abn logo
May 9 2021 @ 12:05PM

జీడిమెట్లలో గృహిణి అదృశ్యం

హైదరాబాద్/జీడిమెట్ల : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. రొడామిస్త్రీనగర్‌ ప్రాంతంలోని సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌లో నివాసముండే డప్పుడ దేవదాస్‌, లలిత(25) భార్యాభర్తలు. ఈ నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన లలిత కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్రైమ్ మరిన్ని...