Abn logo
Sep 24 2021 @ 23:13PM

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

వరలక్ష్మి (ఫైల్‌ ఫొటో)

మల్కాపురం, సెప్టెంబరు 24 : పిల్లలు పుట్టలేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీహరిపురంలోని పవన్‌పుత్ర నగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురానికి చెందిన వరలక్ష్మి(29)కి అదే ప్రాంతానికి చెందిన నాగబోయిన సురేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. సురేశ్‌కు నేవల్‌ డాక్‌యార్డులో టెక్నీషియన్‌గా ఉద్యోగం రావడంతో దంపతులిద్దరూ ఇక్కడికి వచ్చి శ్రీహరిపురం పవన్‌పుత్ర నగర్‌లో నివాసముంటున్నారు. కాగా పిల్లలు పుట్టలేదని వరలక్ష్మి ఆవేదన చెందుతుండేది. గురువారం ఉదయం ఆమె భర్త డ్యూటీకి వెళ్లిపోయాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లి చూసేసరికి వరలక్ష్మి ఫ్యాన్‌ హుక్‌కి చీరతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. మల్కాపురం సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.