వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-14T07:13:03+05:30 IST

మండలంలో గూడెపుకుంటతండాకు చెందిన వి వాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

పెన్‌పహాడ్‌, మే 13: మండలంలో గూడెపుకుంటతండాకు చెందిన వి వాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూగులోతు సరిత(27) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసు కుంది. ఆమె వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. తాము ఉపాఽధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సరికే ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపినట్లు పో లీసులు పేర్కొన్నారు. మృతురాలి భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణిం చాడు. ఆమెకు కుమారుడు ఉన్నాడు. సరిత తండ్రి భూక్య వాలియా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపారు.


Updated Date - 2021-05-14T07:13:03+05:30 IST