Gay Marriage: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. తాజ్ మహల్ ముందు లవ్ ప్రపోజల్.. అంగరంగ వైభవంగా పెళ్లి..

ABN , First Publish Date - 2022-07-05T21:10:57+05:30 IST

ప్రేమకు జాతి, కులం, మతమే కాదు.. లింగ భేదం కూడా ఉండదని ఇటీవలి కాలంలో చాలా మంది నిరూపిస్తున్నారు.

Gay Marriage: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. తాజ్ మహల్ ముందు లవ్ ప్రపోజల్.. అంగరంగ వైభవంగా పెళ్లి..

ప్రేమకు జాతి, కులం, మతమే కాదు.. లింగ భేదం కూడా ఉండదని ఇటీవలి కాలంలో చాలా మంది నిరూపిస్తున్నారు. స్వలింగ వివాహాలను ఇప్పటికే చాలా దేశాలు ఆమోదిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత్‌లో కూడా ఈ తరహా ప్రేమలు, పెళ్లిళ్లు పెరుగుతున్నాయి. తాజాగా కోల్‌కతాకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకున్నారు. ఆదివారం జరిగిన వివాహ వేడుకలో వీరిద్దరు ఒకటయ్యారు. ఈ వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. 


ఇది కూడా చదవండి..

అరగంటలో కోటి రూపాయలు కొట్టేశారు.. అచ్చం సినిమాల్లో జరిగినట్టుగానే..


ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్న అభిషేక్ రే, డిజిటల్ మార్కెటర్ చైతన్య శర్మ వివాహం ద్వారా ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిషేక్ సంప్రదాయ బెంగాలీ వరుడిలా ధోతీ-కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీని ధరించాడు. సాధారణ వివాహంలాగానే మొహందీ, హల్దీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. వీరి పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-07-05T21:10:57+05:30 IST