మేకను పెళ్లి చేసుకున్న యువకుడు

ABN , First Publish Date - 2022-04-03T23:40:48+05:30 IST

నవ సమాజ నిర్మాణంలో నాగరిక మానవుడు గ్రహాల అంతరాలను సైతం చేధిస్తూ ముందుకు సాగుతుంటే మారుమూల ప్రాంతాల్లో

మేకను పెళ్లి చేసుకున్న యువకుడు

నూజివీడు: నవ సమాజ నిర్మాణంలో నాగరిక మానవుడు గ్రహాల అంతరాలను సైతం చేధిస్తూ ముందుకు సాగుతుంటే మారుమూల ప్రాంతాల్లో మాత్రం మూడ నమ్మకాల మైకంలో ప్రజలున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్డులో దోష నివారణ కోసం అంటూ ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. జాతకం పట్ల నమ్మకమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని జాతకంలో ఉందట. దీంతో దోష నివారణ జరిపించాలని ఆ యువకుడు నిర్ణయం తీసుకున్నాడు. ఉగాది రోజున స్థానికంగా ఉండే నవగ్రహ ఆలయంలో సదరు యువకుడికి అర్చకుడు మేకతో వివాహం జరిపించాడు. యువకుడు మేకను పెళ్లి చేస్తున్న దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. 

Updated Date - 2022-04-03T23:40:48+05:30 IST