ఈ-నమోదులో ‘వివాహం’ ఆప్షన్‌ తొలగింపు

ABN , First Publish Date - 2021-05-18T17:58:37+05:30 IST

ఈ-నమోదులో ‘వివాహం’ అనే ఆప్షన్‌ను పలువురు తప్పుగా వినియోగిస్తుందు

ఈ-నమోదులో ‘వివాహం’ ఆప్షన్‌ తొలగింపు

చెన్నై/పెరంబూర్‌ : ఈ-నమోదులో ‘వివాహం’ అనే ఆప్షన్‌ను పలువురు తప్పుగా వినియోగిస్తుందు వల్ల దానిని తొలగించినట్లు రాష్ట్రప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పలు నిబంధనలతో కూడిన సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రభుత్వం అమలుచేస్తోంది. అంతర్‌ జిల్లాలు, పొరుగు జిల్లాలకు వెళ్లాలంటే ఈ-నమోదు తప్పనిసరి చేసింది. ఈ-నమోదుకు నాలుగు కారణాలను ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర వైద్య సేవలు, వృద్ధుల సంరక్షణ, అంత్యక్రియలు, అనంతరం కార్యక్రమాలు, వివాహాలు తదితరాలకు మాత్రమే ఈ- నమోదు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా వెళ్లేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ నేప థ్యంలో, ఈ-నమోదులో ‘వివాహం’ అనే ఆప్షన్‌ను ప్రభుత్వం తొలగిం చింది. ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం తెలిపిన వివరణలో, వివాహం అనే ఆప్షన్‌ను పలువురు తప్పుగా వినియోగిస్తున్నారని, ఆ పేరుతో ప్రజలు అనవ సరంగా బయట తిరిగే అవకాశాలుండడంతో, ఆ ఆప్షన్‌ తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-05-18T17:58:37+05:30 IST