అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్ ఆశీస్సులు..!
ABN , First Publish Date - 2021-06-21T13:33:37+05:30 IST
తెలంగాణ అమ్మాయి.. ఆంధ్ర అబ్బాయి.. అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్లో ఆశీస్సులు..! ఇదీ.. కరోనా వేళ.. క్లుప్తంగా ఓ తెలుగింటి పెళ్లి చిత్రం! వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన కొత్తపల్లి కృ
తెలంగాణ అమ్మాయిని పెళ్లాడిన ఆంధ్ర అబ్బాయి..
ఆన్‌లైన్లోనే వీక్షించి.. అక్షింతలు వేసిన తల్లిదండ్రులు
బోధన్, జూన్ 20: తెలంగాణ అమ్మాయి.. ఆంధ్ర అబ్బాయి.. అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్లో ఆశీస్సులు..! ఇదీ.. కరోనా వేళ.. క్లుప్తంగా ఓ తెలుగింటి పెళ్లి చిత్రం! వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన కొత్తపల్లి కృష్ణరావు, వాణిశ్రీ దంపతుల కుమార్తె కొత్తపల్లి తనుజా, గుంటూరుకు చెందిన రవి, పద్మ దంపతుల కుమారుడు కృష్ణతేజ.. అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారి పెద్దలు తనూజ, కృష్ణతేజలకు వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. అంతర్జాతీయ విమానాలు తిరిగే పరిస్థితి లేకపోవడంతో వధూవరులు భారత్ రాలేకపోయారు. అయినా అనుకున్న ముహూర్తానికే అమెరికాలోని ఇండియన్ కాన్స్‌లేట్ సెంటర్ టెంపుల్‌లో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో వధూవరులు ఒక్కటయ్యారు. వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎల్‌ఈడీ స్ర్కీన్లపై ఈ వేడుకను వీక్షించి ఆశీర్వదించారు.