లాక్‌డౌన్ ఎత్తివేతతో అంబరాన్ని తాకుతున్న పెళ్లి సందడి!

ABN , First Publish Date - 2020-04-10T17:36:51+05:30 IST

గత నాలుగు నెలలుగా కొవిడ్-19 కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన చైనాలోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది....

లాక్‌డౌన్ ఎత్తివేతతో అంబరాన్ని తాకుతున్న పెళ్లి సందడి!

వుహాన్: గత నాలుగు నెలలుగా కొవిడ్-19 కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన చైనాలోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. రెండ్రోజుల క్రితం లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ఇక్కడ మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ రెండు రోజుల్లోనే వివాహాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 300 శాతం పెరిగినట్టు అలిపే యాప్ వెల్లడించింది. ‘‘వెడ్డింగ్ అపాయింట్మెంట్ కోసం అలీపేను సందర్శిస్తున్న వారి సంఖ్య ఊహించిన దానికంటే అధికంగా ఉంది. 300 శాతం మేర ట్రాఫిక్ పెరగడంతో తాత్కాలికంగా అపాయింట్మెంట్ వ్యవస్థ ఫ్రీజ్ అయ్యింది. అయితే కుప్పకూలలేదు. ఇంకా నెమ్మదించించే అవకాశాలున్నాయి..’’ అని చైనా టెక్ కంపెనీ అలీపే పేర్కొంది.


కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన వుహాన్‌లో 76 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసింది. 1.10 కోట్ల మంది ప్రజలున్న ఈ నగరం కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లు ఎలాంటి శుభకార్యాలు లేకుండా గడిపింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహ దరఖాస్తులను పూర్తిగా నిలిపివేశారు. తాజాగా లాక్‌డౌన్ ఎత్తివేసినా వివాహం చేసుకోబోయే వారు క్లీన్ హెల్త్ కోడ్‌ను పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ప్రకారం పెళ్లికి సిద్ధమైన జంటలు తమకు కరోనా లేదని ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే దరఖాస్తులు స్వీకరిస్తారు.

Updated Date - 2020-04-10T17:36:51+05:30 IST