Marriage and Divorce: కువైత్‌లో అనూహ్య పరిణామం.. గత ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి!

ABN , First Publish Date - 2022-07-31T14:21:07+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait)లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2021 ఏడాది దీనికి వేదిక అయింది. 2021లో అనూహ్యంగా పెళ్లిల (Marriages) రేటుతో పాటు విడాకుల(Divorce) రేటు కూడా పెరిగింది. గడిచిన ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Marriage and Divorce: కువైత్‌లో అనూహ్య పరిణామం.. గత ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait)లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2021 ఏడాది దీనికి వేదిక అయింది. 2021లో అనూహ్యంగా పెళ్లిల (Marriages) రేటుతో పాటు విడాకుల(Divorce) రేటు కూడా పెరిగింది. గడిచిన ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు. 2021లో మ్యారేజ్ రేటు 28.9శాతంగా నమోదైతే.. విడాకుల రేటు 13.7శాతంగా నమోదైంది. గత ఐదేళ్లలో ఇవే అత్యధిక గణాంకాలు కావడం గమనార్హం. 2017 నుంచి 2021 వరకు ఐదేళ్లకు సంబంధించి తాజాగా సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో (Central Statistical Bureau) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఈ విషయం తెలిసింది.  


ఇక 2021లో అక్కడ మొత్తం 13,804 పెళ్లిలు జరగగా వీటిలో 11,322 (82 శాతం) కువైటీలకు కువైటీలతో జరిగినవి కాగా.. 1,783 వివాహాలు కువైటీ పౌరులకు నాన్-కువైటీలతో జరిగినవిగా గణాంకాలు చెబుతున్నాయి. కువైటీలు, నాన్-కువైటీల మధ్య అత్యధిక వివాహాల రేటు జనవరి 2021లో నమోదైంది. ఈ ఒక్క నెలలోనే కువైత్ పురుషులకు నాన్-కువైటీ మహిళలతో మొత్తం 1,295 వివాహాలు అయ్యాయి. అలాగే కువైటీ మహిళలతో నాన్-కువైటీలకు 1,197 పెళ్లిలు జరిగాయి. మరోవైపు 2021లో విడాకుల రేటు సైతం ఐదేళ్లలో అత్యధిక రికార్డును అందుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం 6,205 విడాకుల కేసులు నమోదయ్యాయి. వీటిలో కువైటీ మహిళలకు చెందినవి 5,144 అయితే, నాన్-కువైటీ మహిళలకు సంబంధించినవి 1,061 కేసులు ఉన్నాయి. 


Updated Date - 2022-07-31T14:21:07+05:30 IST