పైడితల్లికి నీరాజనం

ABN , First Publish Date - 2021-10-20T05:08:44+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం మంగళవారం నగరంలో వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తజనం సిరిమాను తిలకించి పులకించిపోయారు.

పైడితల్లికి నీరాజనం
సిరిమానోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

  ఘనంగా సిరిమానోత్సవం

  భారీగా తరలివచ్చిన భక్తులు 

  మార్మోగిన పైడిమాంబ నామస్మరణ

  ( ఆంధ్రజ్యోతి బృందం)

 ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం మంగళవారం నగరంలో వైభవంగా జరిగింది.  వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తజనం సిరిమాను తిలకించి పులకించిపోయారు. ఈ సందర్భంగా పైడిమాంబ నామస్మరణ మార్మోగింది.  మూడులాంతర్ల  జంక్షన్‌ నుంచి ఆలయ పరిసన ప్రాంతాలు అశేష భక్తజనంతో కిక్కిరిశాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పకబ్బందీగా చర్యలు చేపట్టారు. ఉత్సవంలో కరోనా నిబంధనలు పాటించకపోవడం గమనార్హం.  మొత్తంగా ఉత్సవం విజయవంతం కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. 

 

Updated Date - 2021-10-20T05:08:44+05:30 IST